BPT: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా బాపట్లలో సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొని యాత్రను ప్రారంభించారు. 2047 నాటికి భారత్‌ను అగ్రరాజ్యంగా నిలబెట్టడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా వికసిత భారత్ సంకల్ప సభ


