హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులకు చార్జ్ మెమోలు జారీ

CTR: చిత్తూరు జిల్లాలో రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పనిచేసిన 11 మంది ఇంజనీరింగ్ అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేశారు. వీటిని అందుకున్న అధికారులు 10 రోజులలోపు రాతపూర్వక వివరణ అందించాలని ఆదేశించారు. వీటిని సమర్పించకపోతే రికార్డుల ఆధారంగా శాఖపరమైన విచారణ చేపట్టి చర్యలు చేపడతామని తెలిపారు.