హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వంజంగి, లంబసింగిని తలపించేలా మంచు మేఘాలు

ASR: వంజంగి, లంబసింగిని తలపించేలా ఇవాళ ఉదయం పెదబయలు మండలం పెదకోడాపల్లి, ఆండ్రివర ఘాట్‌లో మంచు మేఘాలు అలుముకున్నాయి. అల్లూరి ఏజెన్సీ ప్రాంతం సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. ఉదయం పూట కురుస్తున్న దట్టమైన పొగమంచుతో పాటు, పాల సముద్రాన్ని తలపించేలా, ఆకాశంలో ఉన్న మేఘాలను తాకేలా ఏర్పడుతున్న మంచు మేఘాల అందాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.