హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాలకు నిలిచిన వరద ప్రవాహం

WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఎలాంటి వరద ప్రవాహం లేదని, 9టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 4.477 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. కుడి కాల్వకు 715, ఎడమ కాల్వకు 1,207 క్యూసెక్కుల చొప్పున సాగునీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 2,454 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది.