MLG: ఏటూరునాగారం మండలంలోని ఎక్కెల సమీపంలో ఐటీడీఏ నూతన భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉద్యాన విభాగం స్థలంలో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పునాది పనులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయం పాతబడటం, ఇరుకుగా ఉండటంతో తుపాకులగూడెం రోడ్డులో రూ.25 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నారు. పనుల పూర్తికి ఏడాది పైన పట్టే అవకాశం ఉంది.
తెలంగాణ
ఐటీడీఏ కొత్త భవనం పనులు ముమ్మరం


