హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

PLD: నరసరావుపేట కోడెల శివప్రసాద్ స్టేడియం సమీపంలోని అన్న క్యాంటీన్‌ను గురువారం ఉదయం ఎమ్మెల్యే డా. చదలవాడ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్పాహారాన్ని స్వయంగా రుచి చూశారు. క్యాంటీన్‌కు వచ్చిన ప్రజలను కలిసి ఆహారం నాణ్యత, రుచి, సమయానికి అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌లోని సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించారు.