హైదరాబాద్: 28°C
క్రీడలు

భాగ్యనగరంలో APL సీజన్-2 టోర్నీ షురూ

TG: హైదరాబాద్ వేదికగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్(APL) సీజన్-2 ఇవాళ్టి నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మన భారత క్రీడాకారులతో పాటు పలువురు విదేశీ ఆర్చర్లు కూడా పోటీ పడనున్నారు. మొత్తం ఆరు జట్లకు చెందిన 48 మంది ఆర్చర్లు ఈ లీగ్‌ బరిలో నిలిచారు. ఉత్కంఠగా సాగనున్న ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఈనెల 18న HYDలోనే జరగనుంది. అభిమానుల్లో ఈ టోర్నీపై ఆసక్తి నెలకొంది.