హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరిఖనిలో మురుగు కాలువల ఆక్రమణ

PDPL: గోదావరిఖనిలోని పలు కాలనీల్లో ఇళ్ల ముందు ఉన్న మురుగు కాలువలను ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువ ఒడ్డువరకు నిర్మాణాలు చేపట్టి, ఆపై కాలువలను కబ్జా చేస్తూ స్లాబులు వేస్తున్నారని చెబుతున్నారు. దీంతో మురుగు కాలువల నిర్వహణకు ఆటంకం కలిగే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ఆక్రమణలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.