ఖమ్మం వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల సహాయాన్ని వాడుకుని నవంబర్ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేసిన కలెక్టర్


