హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ బంగారు బిస్కెట్‌తో గొలుసు అపహరణ

HNK: దామెర మండలం ఊరుగొండ గ్రామంలో తక్కువ ధరకే బంగారం బిస్కెట్‌ ఇస్తామని నమ్మించి హైమ అనే మహిళ వద్ద నుంచి ఇద్దరు వ్యక్తులు రెండున్నర తులాల బంగారు గొలుసును బుధవారం అపహరించారు. నకిలీ బిస్కెట్‌ ఇచ్చి గొలుసు తీసుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.