హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్ బాలికపై లైంగిక దాడి..!

MDK: ప్రేమ, పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను మాయమాటలతో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నీలం కుమార్‌ (30)కు ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించింది. శంకరంపేట ఆర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2021లో నమోదైన కేసులో పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.