NTR: పెనుగంచిప్రోలు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నేడు ఉదయం 10:30 గంటలకు 17 మంది చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించనున్నారు. కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్య అతితులుగా పాల్గొని ఈ రుణ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు కర్ల వెంకట నారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు చిరు వ్యాపారులకు రుణ చెక్కుల పంపిణీ


