హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిమ్మాపూర్‌లో తీవ్ర విషాదం..!

MDK: కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వడ్ల శివ (20) కుటుంబ సమస్యల వల్ల మనస్తాపం చెంది బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు కళ్లముందే అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో తిమ్మాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.