హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారి దుస్థితిపై గ్రామస్తుల ఆవేదన

కృష్ణా: పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామ రహదారి అధ్వానంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి గుంతలమయంగా మారడంతో పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారి సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు.