SRD: సదాశివపేట గురునగర్ కాలనీలోని భవానీమాత మందిరంలో ఈనెల 3న హుండీ చోరీకి పాల్పడిన మల్లెపల్లి శ్రీనివాస్ (29)ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై పెంటయ్య, కానిస్టేబుళ్లు వెంకటశం, సిద్దార్థ, వీరేశంలను ఇన్‌స్పెక్టర్ అభినందించారు.
తెలంగాణ
హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్


