E.G: రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ కే. రాంబాబు అత్యాధునిక యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో రోగులు, వారి బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం


