ప్రకాశం: ఒంగోలులోని BSNL కార్యాలయం వద్ద బుధవారం ఆల్ ఇండియా పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గతంలో ఇస్తున్న రూ.1,000 మెడికల్ అలవెన్స్‌ను తొలగించారని, దానిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే PRCని వెంటనే అమలు చేయాలని కోరుతూ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మెడికల్ అలవెన్స్ కోసం పెన్షనర్ల నిరసన


