హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి కష్టాలతో రోడ్డెక్కిన మహిళలు

BDK: బూర్గంపాడు మండలం, సారపాకలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు నిరసనకు దిగారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ముత్యాలమ్మ గుడి వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. పది రోజులుగా నీరు అందడం లేదని, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. వెంటనే సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.