హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమావేశం

ASR: పెండింగ్ పనులు పూర్తి చేసి, తాజా సమాచారం, నివేదికలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని పంచాయతీ రాజ్ అధికారులను కలెక్టర్ నిశాంతి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల సన్నద్ధతపై సమావేశమయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు, రహదారి వంటి మౌలిక వసతులను పరిశీలించాలని సూచించారు. మారుమూల, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.