TPT: తడ మండలానికి చెందిన TDP సీనియర్ నాయకురాలు, SS హార్ట్ కేర్ వ్యవస్థాపకురాలు కొమ్ముల ప్రమీలమ్మ(79) బుధవారం కన్నుమూశారు. ఆమె మృతికి మాజీ మంత్రి పరసా రత్నం సంతాపం తెలిపారు. పార్టీ అభివృద్ధికి, సమాజానికి అమూల్యమైన సేవలు అందించారని ఆయన కొనియాడారు. ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొమ్ముల ప్రమీలమ్మ మృతిమాజీ మంత్రి నివాళులు


