హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ వచ్చారని కంకర వేశారు.. వెళ్లాక మరిచారు!

KRNL: కోసిగి పెట్రోల్ బంక్‌ ముందు రోడ్డుపై ఉన్న గుంతలను కలెక్టర్ పర్యటన సందర్భంగా ఆర్‌అండ్‌బీ అధికారులు హడావుడిగా కంకరతో పూడ్చారు. కలెక్టర్ పర్యటనతో రోడ్డుకు మోక్షం లభించి తారు రోడ్డు వేస్తారని స్థానికులు భావించారు. అయితే పర్యటన అనంతరం అధికారులు పట్టించుకోకపోవడంతో కంకర అలాగే ఉండిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.