MLG: కన్నాయిగూడెం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన అగ్నిప్రమాద బాధిత చిన్నారులను బీఆర్‌ఎస్ నాయకులు కాకులమర్రి ప్రదీప్‌రావు బుధవారం హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి తక్షణ ఆర్థిక సహాయం అందించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా అండగా ఉంటామన్నారు.
తెలంగాణ
అగ్ని ప్రమాద బాధిత చిన్నారులకు పరామర్శ


