హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో వీబీజీ రామ్ జీ నిధులు రూ. 10 లక్షలతో నిర్మించిన అపూర్వ మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నరు. మహిళలు స్వయం ఉపాధితో ముందుకు సాగేందుకు ఈ సంఘ భవనం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.