హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

VZM: జొన్నవలస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఫర్నీచర్, ఆట స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ, భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.