హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి..

KMM: వైరా మున్సిపాలిటీ 11వ వార్డులో ఇండియన్‌ గ్యాస్‌ గోడౌన్‌ ఎదురుగా బుధవారం ఓ వ్యక్తి మృతిచెంది పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు చెందిన సారంగంగా గుర్తించారు. ఆయన అక్కడికి ఎలా వచ్చారు, మృతికి కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.