ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం హుండీ కానుకలను లెక్కించారు. గత 90 రోజులకు గాను స్వామివారికి రూ.17,26,166 ఆదాయం సమకూరినట్లు ఈవో మానికల రాంబాబు తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్, ఆలయ ఛైర్మన్ అల్లూరి రామకృష్ణ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?


