హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల పొలాలకు దారి కల్పించాలని ధర్నా

అన్నమయ్య: రాయచోటి ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. చిన్నమండెం మండలం బలిజపల్లి, చాయిబండ చెరువు కింద ఉన్న రైతుల పొలాలకు దారి లేక ఇబ్బందులు పడుతున్నారని పార్టీ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న దారిని కొందరు ఆక్రమించడంతో రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.