హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కల్లూరును కరువు మండలంగా ప్రకటించాలి'

KRNL: కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్‌రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. రైతులతో కలిసి బిర్లాగేట్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని, బీమా, నష్టపరిహారం, కరువు సహాయం అందించాలని కోరారు.