హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువ పూడుకుపోయింది.. ప్రజలకు ఇబ్బందులు

WNP: అమరచింత మండలం రెండో వార్డులో ప్రధాన మురికి కాలువ నిర్మాణంపై ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి. కుతుబ్, లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కాలువను పరిశీలించిన వారు చెత్తతో పూడుకుపోయి దుర్వాసన, దోమలు, క్రిమికీటకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.