హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకు వేదికగా క్రాస్ కంట్రీ పోటీలు

ASR: అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 8న ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు తెలిపారు. ఏయూ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని క్రీడా విభాగం ఇంఛార్జ్ వై. విజయలక్ష్మి తెలిపారు. పోటీలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని పీడీ ఎస్.అప్పారావు అన్నారు.