KDP: ఒంటిమిట్ట మండలం గంగపేరూరు గ్రామంలో ఆటో ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో రేపు జరగాల్సిన పట్టాదారుల పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. గ్రామ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని, తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంగపేరూరులో పాస్‌పుస్తకాల పంపిణీ వాయిదా


