హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నాం'

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో పురోగతిని వివరించారు. 1,15,824 నోటీసులు జారీ చేసి, 1,15,494 విచారణలు పూర్తిచేసినట్లు తెలిపారు. అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.