హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల ఎంపిక'

KDP: అట్లూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్లో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు 14 ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ తెలిపారు. భాకరాపేటకు 1, మాధవరం 2, మాచుపల్లి 1, కొత్తమాధవరం 1 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో లక్కీ డ్రా ద్వారా దుకాణాల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు.