హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్‌పల్లిలో మార్కెట్ భవనం, కమర్షియల్ కాంప్లెక్స్ ప్రారంభం

JGL: మెట్టుపల్లి పట్టణంలో రూ.2.95 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ భవనం, కమర్షియల్ కాంప్లెక్స్‌ను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మార్కెట్ ఆధునీకరణతో రైతులు, వ్యాపారులకు కార్యకలాపాలు విస్తరిస్తాయని తెలిపారు.