హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

KNR: కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను బుధవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, ఎంఐఎం ప్రతినిధులు పాల్గొన్నారు.