హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు..

KMM: ముదిగొండ మండలం అయ్యగారిపల్లికి చెందిన బొడ్డు జ్యోతి బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. రోడ్డు దాటుతుండగా మల్కాపురం వైపు నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఆమెను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జ్యోతిని స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.