హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ చైర్మన్ రేసులోకి వైసీపీ నేత చెల్లుబోయిన?

కోనసీమ: జడ్పీ ఛైర్మన్ రేసులో వైసీపీ నుంచి మరో ప్రముఖ వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. పార్టీకి విశేష సేవలు అందించిన అమలాపురానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్‌ను బీసీ రిజర్వేషన్ వస్తే బరిలోకి దించాలని అధినేత జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. సౌమ్యుడిగా పేరున్న శ్రీనివాస్‌కు అవకాశం దక్కుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.