కృష్ణా: మచిలీపట్నంలో ఆటోలో మర్చిపోయిన విద్యార్థి బ్యాగ్‌ను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి సురక్షితంగా అందజేశారు. బందరు ట్రాఫిక్ సీఐ నున్న రాజు పర్యవేక్షణలో సిబ్బంది ఆటోను ట్రేస్ చేసి బ్యాగ్ వివరాలు సేకరించారు. ప్రజల భద్రతతో పాటు ఆపదలో సహాయం అందించడం కూడా పోలీసుల బాధ్యత అని సీఐ తెలిపారు. ఈ గొప్ప సేవానిరతిని పట్టణ ప్రజలు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మర్చిపోయిన బ్యాగ్‌ను అందజేసిన ట్రాఫిక్ పోలీసులు


