KRNL: మంత్రాలయం మండల కేంద్రంలోని టవర్ ఏరియాలో మూడు వారాలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓ ఉపేంద్రరెడ్డి ఆధ్వర్యంలో టౌన్ ఇన్‌చార్జి వరదరాజులు మోటారు ద్వారా సుమారు 50 ఇళ్లకు నీటిని సరఫరా చేశారు. సమస్య తీరడంతో స్థానిక మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మూడు వారాల నీటి కష్టాలకు చెక్


