హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో బోల్తా.. 11 మందికి గాయాలు

KDOP: ఒంటిమిట్ట మండలం గంగపేరూరు శివారులో ఆటో బోల్తా పడటంతో 11 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. పసుపు పంటలో కలుపు తీత పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రులను ఒంటిమిట్ట పీహెచ్‌సీ, కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.