హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లిలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

అన్నమయ్య: మదనపల్లిలో 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ హైమావతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. తల్లీబిడ్డల సంక్షేమంలో అంగన్వాడీల పాత్ర కీలకమన్నారు. సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ చూపిన అంగన్వాడీ సిబ్బందిని సన్మానించారు.