SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలో ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పరామర్శించారు. బొల్లంపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కేశగాని మహేశ్వర్ గౌడ్, సూర్య నాయక్ తండాకు చెందిన లూనావత్ చెక్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ


