హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల బస్సుల తనిఖీ .. జరిమానా

SRCL: పాఠశాల బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థుల తరలింపుపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. ఎంవీఐ వంశీధర్ బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్, ముస్తాబాద్ మండల కేంద్రంలోని సిద్ధార్థ స్కూల్ బస్సుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను గుర్తించి జరిమానా విధించారు. పత్రాలు లేని రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు.