హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాడవీధుల సుందరీకరణపై ఎమ్మెల్యే సమీక్ష

సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల సుందరీకరణ, రోడ్డు వెడల్పు పనులపై మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని, మాస్టర్ ప్లాన్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, పట్టణానికి ఆకర్షణీయమైన వాతావరణం తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.