హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలోకి 300 మంది చేరిక

NTR: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలువురు వైసీపీ, CPM నేతలు, విద్యాసంస్థల నిర్వాహకులు, వ్యాపారవేత్తలు బుధవారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు వారికి పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. మొత్తం 300 మంది జనసేనలో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.