హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల స్వైర విహారం.. భయాందోళనలో ప్రజలు

ADB: భోరజ్ మండలం పిప్పర్ వాడ గ్రామంలో వీధికుక్కల బెడద ఎక్కువైంది. పలు వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విద్యార్థులు ఒంటరిగా వెళ్లడానికి భయపడుతున్నారు. అలాగే, ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిని కూడా కుక్కలు వెంబడిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి కుక్కలను అదుపులోకి తీసుకుని, ప్రజలను ఈ బెడద నుంచి కాపాడాలన్నారు.