హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్లు ఆవిష్కరణ

GDWL: సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మాసోత్సవాల్లో భాగంగా సైబర్ మోసాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను గద్వాల ఎస్పీ టి. శ్రీనివాసరావు బుధవారం ఆవిష్కరించారు. అత్యాశే మోసగాడి ఆయుధమని, గుర్తుతెలియని లింకులు, నకిలీ ఆఫర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.