హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సాపూర్ బి గ్రామంలో వన్యప్రాణి సంరక్షణపై అవగాహన

ADB: ఉట్నూర్ మండలం నర్సాపూర్ (బి) గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ హేరేకుమ్ర గంగారం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అటవీ అధికారులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. అడవులు, వన్యప్రాణులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని అధికారులు తెలిపారు. వన్యప్రాణుల వేట చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.