హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యూసీజీ ప్రాజెక్టుపై రైతుల ఆందోళన

ELR: ప్రతిపాదిత భూగర్భ బొగ్గు గ్యాస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రేచర్ల వద్ద రైతులు రాస్తారోకో చేశారు. ఈ ప్రాజెక్టుతో పర్యావరణం కలుషితమై, పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును తక్షణమే విరమించుకోవాలని, తమ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.