హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ మోసాలపై ఎస్పీ అవగాహన

సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ యూనివర్సిటి విద్యార్థులకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి వంటి అంశాల గురించి క్లుప్తంగా వివరించారు. ఆన్లైన్లో కొత్త పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఇలాంటి సమస్య ఎదురైనా డయల్ 112కు సంప్రదించాలన్నారు.